
హుండీ నగదును లెక్కిస్తున్న దృశ్యం
ఉరవకొండ: ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి 2023–24 సంవత్సరానికి గాను శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తనను చైర్మన్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ మోసేనురాజుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభ్యుల గౌరవాధికారాలకు ఎవరు భంగం కలిగించినా, ప్రొటోకాల్ విషయంలో ఎటువంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించినా విచారణ జరిపి చర్యలు తీసుకునేలా ప్రివిలేజ్ కమిటీ పని చేస్తుందన్నారు. చైర్మన్‌గా నియమితులైన వై.శివరామిరెడ్డికి ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
నెట్టికంటుడి హుండీ ఆదాయం రూ.64.27 లక్షలు
గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి హుండీ కానుకల ద్వారా రూ.64.27 లక్షల ఆదాయం లభించినట్లు ఈఓ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. భక్తులు స్వామివారికి హుండీ ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు మంగళవారం చేపట్టారు. 43 రోజులకు గానూ హుండీల ద్వారా రూ.64,27,361 నగదుతో పాటు అన్నదాన హుండీ ద్వారా రూ.21,844 అందిందన్నారు. అలాగే 0.01 గ్రాముల బంగారు, 2.58 కిలోల వెండిని కానుకల రూపంలో భక్తులు స్వామివారికి సమర్పించినట్లు తెలిపారు. ఆలయ అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆర్టీసీ సేవాసమితి సభ్యులు, బళ్లారికి చెందిన వీరభద్రసేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
తహసీల్దార్లకు డిప్యుటేషన్
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో పలువురు తహసీల్దార్లకు డిప్యుటేషన్ ద్వారా పోస్టింగ్ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ గౌతమి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు తహసీల్దార్లకు డిప్యుటేషన్, ఒకరికి డైరెక్ట్ పోస్టింగ్, ఒకరికి పదోన్నతిపై పోస్టింగ్, ఒకరికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇందులో రాయదుర్గం తహసీల్దార్ మారుతిని అనంతపురం అర్బన్‌కు, అనంతపురం నుంచి శ్రీధర్‌మూర్తిని ఉరవకొండకు, తాడిపత్రి నుంచి మునివేలును రాప్తాడుకు డిప్యుటేషన్‌పై పంపారు. యాడికి తహసీల్దార్ అలెగ్జాండర్‌ను తాడిపత్రికి, బ్రహ్మసముద్రం తహసీల్దార్ బాలకిషన్‌ను రాయదుర్గానికి డిప్యుటేషన్ వేశారు. ఇక యాడికి డిప్యూటీ తహసీల్దార్ బాలమ్మను అక్కడే ఇన్‌చార్జ్ తహసీల్దార్‌గా నియమించారు. బుక్కరాయసముద్రం డీటీగా ఉన్న ప్రతాప్‌రెడ్డికి గుంతకల్లు తహసీల్దార్‌గా పదోన్నతి కల్పించారు. డ్వామాలో పనిచేస్తున్న విజయలక్ష్మిని అనంతపురం రూరల్ తహసీ ల్దార్‌గా నియమించారు.

