అచ్యుతాపురం రూరల్ : విదు్‌య్‌త్‌షాక్‌కు గురై చూడి గేదె మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన అచ్యుతాపురం పంచాయతీ కార్యాలయం ఎదుట ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ ఫెన్సింగ్ వద్ద శుక్రవారం జరిగింది. అచ్యుతాపురం గ్రామ పాడి రైతు కిల్లాడి చంటికి చెందిన గేదె 9 నెలల చూలుతో ఉందని తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఫెన్సింగ్ తీగల ద్వారా షాక్ తగిలి పాడిగేదె అకారణంగా మృత్యువాత పడిందని రైతు వాపోయారు. రూ. లక్ష 30 వేల రూపాయలకు కొనుగోలు చేశానని పాడి రైతు ఆవేదన చెందారు. ప్రభుత్వం రైతు కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. స్థానికులు ఎవరైనా అటువెళ్లినా ప్రమాదం బారిన పడేవారని ఆందోళన చెందారు. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యం జనానికి ప్రాణ సంకటంగా మారిందని స్థానిక ప్రజలంటున్నారు. రానున్నది వర్షాకాలం కనుక విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తత వహించాలని కోరుతున్నారు.


