మునగపాక: ఉపాధి కూలీలకు తనవంతు సాయం అందించేందుకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముందుకొచ్చారు. వేసవిలో పనులు చేసే కూలీలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు తన సొంత నిధులతో సమకూర్చిన హాట్ బాక్స్‌లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేస్తున్నారు. ఈ పంపిణీ కార్యక్రమం నాల్గో రోజుకు చేరుకుంది. ములబంద గోడీ ప్రాంత కూలీలు, పేటకట్టు మూల సంఘ పరిధిలో 114 మంది కూలీలకు ఆయన వస్తువులను అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున సాధ్యమైనంతలో ఉదయం 10 గంటల లోపు పనులు ముగించుకోవాలని సూచించారు. మాజీ సర్పంచ్ దిమ్మల అప్పారావు, మాజీ జెడ్‌పీటీసీ మళ్ల సంజీవరావు, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జిల్లా అధికార ప్రతినిధి ఆడారి కాశీబాబు, పార్టీ నేతలు మళ్ల రామజోగినాయుడు, పెంటకోట సారధి, పెంటకోట సత్యనారాయణ, పెంటకోట వెంకట్, ఎంఎం నాయుడు, ఆడారి లక్ష్మణరావు, మళ్ల జగ్గప్పారావు, దాడి శ్రీరామమూర్తి, బొడ్డేడ సోమరాజు, పెంటకోట శ్రీనివాసరావు(నెట్), భీశెట్టి ఈశ్వరరావు, ఆడారి రమణబాబు, కోనపల్లి రామ్మోహనరావు, టెక్కలి కొండలరావు, బొడ్డేడ రామారావు, కరణం గణేష్, దాడి చంద్రరావు, వెలగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


