అన్నదాతలకు దుఃఖీభవ! | - | Sakshi
Sakshi News home page

అన్నదాతలకు దుఃఖీభవ!

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

రైతు సాయంలోనూ కూటమి సర్కార్‌ కోత

జిల్లాలో 23,242 మంది రైతులకు మొండిచేయి

గత వైఎస్సార్‌సీపీ హయాంలో 2,65,778 మందికి లబ్ధి

ప్రస్తుతం 2,42,536 మందికే పరిమితం

తొలి ఏడాదే హామీని తుంగలో తొక్కిన చంద్రబాబు సర్కార్‌

నిబంధనల పేరిట 9 వేల మందికి పైగా కౌలు రైతులకు తీవ్ర అన్యాయం

సాక్షి, అనకాపల్లి : రాష్ట్రంలో సాగుచేస్తున్న అన్నదాతల ఆశలపై కూటమి ప్రభుత్వం చల్లని నీళ్లు చల్లింది. ఎన్నికల ముందు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రూ.20 వేల పెట్టుబడి సహాయం అందిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గుప్పించిన హామీలు అధికారంలోకి వచ్చాక ఉత్తుత్తివేనని తేలిపోయింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందించడంలో కూటమి సర్కార్‌ దారుణంగా కత్తెర వేసింది. అర్హత గల రైతులను, కౌలు రైతులను వేలాది మంది రైతులకు మొండిచేయి చూపించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదే అన్నదాతలకు తీవ్ర నిరాశ కల్పించిన చంద్రబాబు ప్రభుత్వం.. గతేడాది, ఈ ఏడాది కూడా అరకొరగానే ఆర్థిక సాయం అందిస్తూ చేతులు దులుపుకొంటున్నది. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో జిల్లాలో కేవలం 2,42,536 మందిని మాత్రమే లబ్ధిదారులుగా చూపించారు.

తొలి ఏడాదే ఎగవేత.. వేలాది మందిపై వేటు

అనకాపల్లి జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2,65,778 మంది రైతులకు వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఎంతో పారదర్శకంగా లబ్ధి చేకూరింది. ఏడాదికి రూ.304.43 కోట్ల చొప్పున నాలుగేళ్ల పాటు ఏకంగా రూ.1301.12 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేసి ఆర్థిక భరోసా కల్పించారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ లబ్ధిదారుల జాబితా చూస్తే అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ఈ ఏడాది విడుదల చేసిన జాబితాలో జిల్లాలో కేవలం 2,42,536 మందిని మాత్రమే లబ్ధిదారులుగా చూపించారు. అంటే స్పష్టంగా 23,242 మంది రైతులకు ప్రభుత్వం మొండిచేయి చూపించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఇందులో 9 వేల మంది కౌలు రైతులతో పాటు, 14,242 మంది సొంత భూమి కలిగిన రైతులు పథకానికి దూరమయ్యారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన 25,072 మంది రైతులకు భరోసా నిధులు అందగా.. ప్రస్తుత ప్రభుత్వం అందులోనూ కోత పెట్టి 6,499 మంది లబ్ధిదారులను పక్కన పెట్టేసింది.

నేడు అన్నదాత సుఖీభవ,

పీఎం కిసాన్‌ నగదు పంపిణీ

‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్‌’ పథకం కింద 2026–27 ఏళ్లగా సంబంధించిన తొలి విడత నగదు పంపిణీ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5,000, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద అందించే రూ.2,000 కలిపి అర్హులైన రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,000 జమ చేయబడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మాడుగుల నియోజకవర్గంలో చీడికాడ విద్యుత్‌ కార్యాలయం సమీప మైదానం, చోడవరం నియోజకవర్గంలో రావికమతం ఎంపీడీవో కార్యాలయం, యలమంచిలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలం నారాయణపురం జంక్షన్‌ సమీపంలోని శ్రీలక్ష్మీ దేవుళ్ల కన్వెన్షన్‌ హాల్‌ పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్‌.రాయవరం మండలం సైతారు పేట గ్రామ పంచాయతీ కార్యాలయం, అనకాపల్లి నియోజకవర్గంలో కశింకోట ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని కళ్యాణ మండపం, నర్సీపట్నం నియోజకవర్గంలో గోలుగొండ ఎంపీడీవో కార్యాలయం, పెందుర్తి నియోజకవర్గంలో సబ్బవరం శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్‌.రాయవరం మండలం సైతారు పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరుగు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ హాజరుకానున్నారు.

నిబంధనల పేరిట కొర్రీలు..

గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి సర్కార్‌ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో రైతులందరినీ ఒకేలా పరిగణించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలను వర్తింపజేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కౌలు రైతుల గుర్తింపు, కుటుంబంలో ఒక్కరికే లబ్ధి, పది సెంట్ల లోపు భూమి ఉన్న వారిని తొలగించడం వంటి కొర్‌?రలు పెడుతోంది. వీటికి తోడు ఆధార్‌ అనుసంధానం, ఈ–కేవైసీ, బ్యాంకు ఖాతాల అనుసంధానం కాలేదనే సాకులతో అధికారులు పెద్ద ఎత్తున రైతుల పేర్లను జాబితా నుండి తొలగించారు. ఈ సాకుల వల్లే జిల్లాలో 6,499 మంది రైతులు ఈ పథకానికి శాశ్వతంగా దూరమయ్యారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement