ఏయూలో కీలక నియామకాలు | - | Sakshi
Sakshi News home page

ఏయూలో కీలక నియామకాలు

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

నూతన డీన్‌కు ఉత్తర్వులు అందజేస్తున్న ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్‌

విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా పలువురు డీన్లు, అసోసియేట్‌ డీన్లను నియమిస్తూ యూనివర్సిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ నియామక ఉత్తర్వులను అందజేసి అభినందించారు. ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌గా ఆచార్య ఎం.అన్నపూర్ణ, పీజీ–ప్రొఫెషనల్‌ కోర్సుల డీన్‌గా ఆచార్య వై.అబ్బులు, యూజీ పరీక్షల డీన్‌గా ఆచార్య బి.మునిస్వామి, బ్రాండింగ్‌–మీడియా అసోసియేట్‌ డీన్‌గా ఆచార్య సి.ఎం.వినయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఆర్‌ అండ్‌ డీ అసోసియేట్‌ డీన్లుగా టి.ఆర్‌.జ్యోత్స్న, పి. ఏడుకొండలు, సీడీవోఈ అసోసియేట్‌ డైరెక్టర్‌గా ఆచార్య వి.లక్ష్మి బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే పీజీ–ప్రొఫెషనల్‌ కోర్సుల అసోసియేట్‌ డీన్‌గా ఆచార్య పి.వి.లక్ష్మీనారాయణ, కాన్ఫిడెన్షియల్‌ (పరీక్షలు) డీన్‌గా ఎల్‌.ఎస్‌.వి.ప్రసాద్‌, ఆలుమ్ని అఫైర్స్‌–కార్పొరేట్‌ రిలేషన్స్‌ అసోసియేట్‌ డీన్‌గా ఆచార్య ఎన్‌.సాల్మన్‌ బెన్నీ, విద్యార్థి సంక్షేమ అసోసియేట్‌ డీన్‌గా ఆచార్య వి.ధనరాజు నియమితులయ్యారు. ఎన్‌సీఏ కోఆర్డినేటర్‌గా ఆచార్య కె.సరస్వతి విద్యార్థి, హాస్పిటాలిటీ–ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ డీన్‌గా ఆచార్య సి.హెచ్‌.ఆశ ఇమ్మానియల్‌ రాజు, స్పాట్‌ వాల్యుయేషన్‌ అసోసియేట్‌ డీన్‌గా ఆచార్య కె.రమేష్‌బాబు, సెంటర్‌ ఫర్‌ డిఫెన్స్‌ స్టడీస్‌ గౌరవ డైరెక్టర్‌గా ఆచార్య సి.వి.నాయుడును నియమించారు. గతంలో ఇతర బాధ్యతల్లో ఉన్న డీన్లు, అసోసియేట్‌ డీన్ల పదవీకాలాన్ని కూడా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య కె. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement