హాకీ క్రీడాకారిణికి అభినందన | - | Sakshi
Sakshi News home page

హాకీ క్రీడాకారిణికి అభినందన

Jun 20 2026 12:25 AM | Updated on Jun 20 2026 12:25 AM

అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి నిమ్మి గీతశ్రీని అభినందిస్తున్న శాప్‌ బోర్డు మెంబర్‌ పి.బి.వి.ఎస్‌.వి రాజు, తదితరులు

అనకాపల్లి టౌన్‌ : ప్రభుత్వం తగిన ప్రోత్సాహం అందిస్తే ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధిస్తానని, అలాగే మరింత మంది క్రీడాకారులను తయారు చేస్తానని అంతర్జాతీయ క్రీడా కారిణి నమ్మి గీతశ్రీ తెలిపారు. ఇటీవల జపాన్‌ దేశంలో జరిగిన మహిళల అండర్‌–18 ఆసియా హాకీ కప్‌ పోటీలలో నక్కపల్లికి చెందిన నమ్మి గీతశ్రీ కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమెను శాప్‌ బోర్డు మెంబర్‌ పి.బి.వి.ఎన్‌.ఎన్‌ రాజు, జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పూజారి శైలజ అభినందించి, రూ.50వేల నగదు, జ్ఞాపిక అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాను నిలపడం గర్వకారణం అన్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి భారత జట్టుకు ప్రాతినిఽథ్యం వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ టెన్నికోయిట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి రంజిత్‌, హాకీ కోచ్‌, కోచ్‌ రంజిత్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement