అనకాపల్లి టౌన్ : పోలీస్ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అదనపు ఎస్పీ ఎల్. మోహన్‌రావు పేర్కొన్నారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సంపర్క్ ఫోన్ ఇన్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా పోలీసు సిబ్బంది సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకొని సంబందిత అధికారులతో నేరుగా మాట్లాడారు. సిబ్బంది బదిలీలు, పోస్టింగ్‌లు, సెలవులు, సర్వీస్, కుటుంబ ఆరోగ్య సమస్యలు తన దృష్టికి వచ్చాయని, వచ్చిన ప్రతి సమస్యను అత్యంత గోప్యంగా ఉంచి పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌బీ డీఎప్పీ జి.ఆర్.ఆర్. మోహన్, సీఐ లక్ష్మి పాల్గొన్నారు.


