నేడు టెన్త్‌ ‘స్పాట్‌’ కేంద్రాలకు నల్లబ్యాడ్జీలతో హాజరు | - | Sakshi
Sakshi News home page

నేడు టెన్త్‌ ‘స్పాట్‌’ కేంద్రాలకు నల్లబ్యాడ్జీలతో హాజరు

Apr 6 2026 7:36 AM | Updated on Apr 6 2026 7:36 AM

ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌

అనకాపల్లి: రాష్ట్రంలోని ఉద్యోగ,ఉపాధ్యాయుల ఆర్థిక,ఆర్థికేతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 6న టెన్త్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలకు ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీల తో హాజరుకానున్నట్టు ఫ్యాప్టో జిల్లా ప్రధాన కార్యదర్శి వై.సుధాకర్‌ తెలిపారు. స్థానిక నర్సింగరావుపేట ఫ్యాప్టో కార్యాలయంలో ఆదివారం జరిగి న సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దశల వారీగా ఉద్యమాలు చేసినప్పటికీ చంద్రబా బు ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకుండా పోయిందన్నారు. దీంతో ఈ నెల 6న టెన్త్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ కేంద్రాలకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో హాజరుకానున్నారని, 9న స్పాట్‌ కేంద్రాల వద్ద నిరసన, 25, 26, 27 తేదీల్లో విజయవాడలో రిలే నిరహారదీక్షలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు దుర్గాప్రసాద్‌, ఐ.వి.రామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు వి.శ్రీలక్ష్మి, వై.శ్రీనివాసరావు, కె.పరదేశి తదితరులు పాల్గొన్నారు.

పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

అనకాపల్లి: ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకం మూడో దశలో భాగంగా పలు కంపెనీల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ఎన్‌.గోవిందరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అర్హులైన యువతీయువకులు వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకో వాలని పేర్కొన్నారు. ఇంటర్న్‌షిప్‌ ద్వారా యువ తకు ప్రాక్టికల్‌ అనుభవంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించనున్నట్టు తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి, 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ విద్యార్హత కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.12లక్షల లోపు ఉండాలని, ఎంపికై న వారికి నెలకు రూ.9వేల వరకు స్టైఫండ్‌ అందజేయనున్నట్టు తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ 6 నుంచి 9 నెలల వరకు ఉంటుందని, మరిన్ని వివరాలకు టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 116090లో గాని, జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయంలో గాని సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement