సీతంపేట(విశాఖ): సంకట హర చతుర్ధి సందర్భంగా ఆదివారం లలితానగర్ లలితా పీఠంలో విజయగణపతికి పంచామృతాభిషేకం, అర్చన, ప్రత్యేక అలంకరణ, విశేష పూజలు నిర్వహించారు. పీఠం అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య దూప దీప నైవేద్యం, గణేశ స్త్రోత్రం, వ్రత కథ చదివారు. అనంతరం పీఠం దర్బారు హాల్‌లో శాస్త్రోక్తంగా హరిద్రా గణపతి హోమం నిర్వహించారు. ఈ హోమం వల్ల కార్యసిద్ధి, విఘ్నాల నివారణ, ఐశ్వర్యం, వివాహ సంబంధ సమస్యల పరిష్కారం, విద్య, బుద్ధి వృద్ధి, వ్యాపార పురోగతి, ఆరోగ్యం, విజయం లభిస్తాయని అర్చకులు తెలిపారు. పీఠం మేనేజర్ మన్నవ కృష్ణసేన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.


