నేత్రపర్వంగా ఎదురు సన్నాహం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా ఎదురు సన్నాహం

Mar 30 2026 8:29 AM | Updated on Mar 30 2026 8:29 AM

నక్కపల్లిలో ఎదురు సన్నాహ మహోత్సవం

నిర్వహిస్తున్న దృశ్యం

నక్కపల్లి: ప్రాచీన శైవక్షేత్రం ఉపమాకలో భువనేశ్వరి సమేత లక్ష్మణేశ్వరాలయంలో వార్షిక కల్యాణోత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శైవాగమన సంప్రదాయం ప్రకారం కల్యాణోత్సవాలు జరిపేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా రాత్రి స్వామివారిని సప్పర వాహనంలోను, పార్వతీ దేవిని పల్లకిలో అలంకరించి కోలాట ప్రదర్శనలతో నక్కపల్లిలో మైలవరభట్ల జోగారావు ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్‌ గొట్టుముక్కల గాయత్రీదేవి ఆది దంపతుల పెళ్లి చూపులు, పెళ్లిమాటల కార్యక్రమాన్ని కళ్లకు కట్టినట్లు వివరించారు. అనంతరం మంచిరాజు సూర్యనారాయణ మూర్తి (సహరాపంతులు), శింగంశెట్టి నాని కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఎదుర్కోలు ఉత్సవానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. పెండ్లిమాట తంతు అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఉపమాక ఆలయానికి ఊరేగింపుగా తరలించారు. అర్ధరాత్రి స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానార్చకులు వెలవలపల్లి మహేష్‌, పీఏసీఎస్‌ పర్సన్‌ ఇన్‌చార్జి కొప్పిశెట్టి బుజ్జి వేదపండితులు పసర కొండ పండు, బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు డీవిరామారావు, శ్రీపాద ప్రణవ్‌రామ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement