అనకాపల్లి: అత్యాశకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని, ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా అదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్ నిర్వాహకులపై ఆన్‌లైన్ బుకీలపై ప్రత్యేక పోలీస్ బృందాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. బెట్టింగ్ నిర్వహించినా, ప్రోత్సహిహించినా, పాల్గొన్నా ఏపీ జూద చట్టం ప్రకారం అరెస్టు చేయడం జరుగుతుందన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడవద్దన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


