మరణంలోనూ వీడని స్నేహం | - | Sakshi
Sakshi News home page

మరణంలోనూ వీడని స్నేహం

Mar 30 2026 8:29 AM | Updated on Mar 30 2026 8:29 AM

ఉమ్మలాడ శారదానదిలో

స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

మునగపాక: వారిద్దరూ ప్రాణ స్నేహితులు.. ఎక్కడకు వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లేవారు. చివరకు శారదానదిలో స్నానానికి వెళ్లి ఒకేసారి మృతి చెందారు. ఈ ఘటన మండలంలోని ఉమ్మలాడలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం ఇక్కడ శారదానదిలో స్నానానికి వెళ్లిన ఇద్దరూ మునిగిపోయి మృతి చెందారు. ఎస్‌ఐ పి.ప్రసాదరావు తెలిపిన వివరాలు ప్రకారం.. అనకాపల్లి మండలం కొత్తూరు పంచాయతీ పరిధి ముత్రాసు కాలనీకి చెందిన చింతా రోహిణ్‌కుమార్‌ (26), తాడి హర్షవర్దన్‌ (24) అనకాపల్లిలోని వేర్వేరు చోట్ల పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఇరువురు కలిసి సమీపంలోని ఉమ్మలాడ శారదానదిలో స్నానానికి వెళ్లారు. స్నానానికి వెళ్లిన ఇద్దరూ నదిలో ఒక్కసారిగా మునిగిపోయారు. గమనించిన స్థానికులు మునగపాక పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి అనకాపల్లి రెండొందల ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. కాగా అందివస్తారనుకున్న కొడుకులు నదిలో మునిగిపోయి ఇలా విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాదరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement