మునగపాక : వడ్డించేవాడు మనోడైతే బంతిలో అఖరిలో కూర్చొన్నా అన్నీ అందుతాయన్న సామెత అందరికీ తెలిసిందే. అలాంటి సంఘటన మునగపాకలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మద్యం దుకాణాలకు అనుమతి ఇవ్వడంతో పలువురు వ్యాపారులు లాటరీ ద్వారా షాపులను దక్కించుకున్న సంగతి తెలిసిందే. మునగపాక మండలంలో ఐదు షాపులు ఉన్నాయి. వాటిలో మునగపాకలో రెండు, నాగవరం, తోటాడ, చూచుకొండ ప్రాంతాల్లో చెరొకటి షాపులు ఉన్నాయి. అయితే ఆయా షాపులకు సంబంధించిన మద్యం అనకాపల్లి గొడౌన్‌ను నుంచి సరఫరా అవుతుంది. ఏ దుకాణానికి ఎంతమేర మద్యం సరఫరా చేయాలన్నా ఎకై ్సజ్ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో షాపు నిర్వాహకులు తమకు కావాల్సిన పలు రకాల మద్యం సీసాలను కొనుగోలు చేస్తుంటారు. ఆయా బాటిళ్లపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌ను ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేస్తే సంబంధిత షాపు పేరు అలాగే వెండర్ నేమ్, బాటిల్ ఎప్పుడు తయారైంది.. అలాగే గొడౌన్ పేరు వంటి వివరాలు తెలుస్తాయి. అయితే మునగపాక మెయిన్‌రోడ్డులోని వైన్ షాపులో చీప్ లిక్కర్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ను తనకు అందిన సమాచారం మేర స్థానిక సాక్షి విలేకరి స్కాన్ చేస్తే ఇతర ప్రాంతానికి చెందిన వెండర్ పేరు అనగా ఎంఎల్‌ఎం వైన్స్ పేరు వస్తుంది. దీనిని బట్టి చూస్తే ఇతర ప్రాంతాలకు చెందిన మద్యం ఇక్కడ యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్నాయన్నది తెటతెల్లం అవుతుంది. గురువారం రాత్రి మునగపాక మెయిన్‌రోడ్డులోని ఇరువైపులా ఉన్న వైన్‌షాపులను ఎకై ్సజ్ అధికారులు తనిఖీ నిర్వహించారు. గుట్టు చప్పుడు కాకుండా కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎకై ్సజ్ సీఐ నాయుడును ఫోన్‌లో వివరణ కోరేందుకు యత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ విషయమై ఉన్నతాధికారులు తగు విచారణ చేపట్టి అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.


