మెయిన్‌రోడ్డు డీసీసీబీ వద్ద ధర్నా చేస్తున్న జిల్లా సహకార ఉద్యోగులు
అనకాపల్లి : జిల్లా సహకార బ్యాంక్‌ల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల వేతన సవరణలను తక్షణమే అమలు చేయాలని బ్యాంక్ ఉద్యోగుల సంఘం మేనేజర్ రజని, అసిస్టెంట్ మేనేజర్ రత్నం అన్నారు. స్థానిక మెయిన్‌రోడ్డు జిల్లా సహకార బ్యాంక్ వద్ద ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల వేతన సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఉద్యోగులు నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ తగిన వేతన సవరణ జరగలేదన్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వేతన సవరణ అమలు చేయాలని వారు కోరారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు ఫీల్డ్ ఆఫీసర్ శ్రీను, స్టాఫ్ అసిస్టెంట్లు సాయికృష్ణ, వాగ్దేవి, హేమ, సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


