నర్సీపట్టం : పట్టణంలో ఇంటింటికీ గ్యాస్ రాకపోవడంతో ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. గంటల కొద్ది వేచి ఉంటున్నారు. సిలిండర్ల లోడు వచ్చాక సమాచారం ఇస్తామని చెబుతూ ఏజెన్సీల నిర్వాహకులు వారిని తిప్పి పంపుతున్నారు. సిలిండర్లు డెలివరీ చేసినట్టు మెసెజ్ వచ్చిందని, గ్యాస్ మాత్రం డెలివరీ చేయలేదని వినియోగదారులు అంటున్నారు. గ్యాస్ సమస్యల పరిష్కారానికి ఉదయం 8 నుంచి రాత్రి గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన టోల్ ఫ్రీ నంబర్లు పని చేయడం లేదని చెబుతున్నారు. గ్యాస్ కొరత ప్రభావం శుభకార్యాలపైనా పడింది. బయట మార్కెట్‌లో బ్లాక్‌లో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు ఉందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.


