మూడు క్షయ రహిత గ్రామాలకు అవార్డులు | - | Sakshi
Sakshi News home page

మూడు క్షయ రహిత గ్రామాలకు అవార్డులు

Mar 25 2026 7:10 AM | Updated on Mar 25 2026 7:10 AM

అవార్డులు అందుకుంటున్న డాక్టర్‌ చరిష్మ, సిబ్బంది

మాకవరపాలెం : మండలంలో మూడు క్షయ రహిత గ్రామాలకు అవార్డులు లభించాయి. గత మూడేళ్లుగా ఒక్క టీబీ కేసు కూడా నమోదు కాకపోవడంతో టీబీ శ్రీ కార్యక్రమంలో భాగంగా బూరుగుపాలెం పీహెచ్‌సీ పధిలోని జి.గంగవరం, పడాలపాలెం, మాకవరపాలెం పీహెచ్‌సీ పరిధిలో జడ్‌.గంగవరం గ్రామాలను క్షయ రహిత గ్రామాలుగా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం అనకాపల్లిలో నిర్వహించిన టీబీ దినోత్సవంలో డీఎంహెచ్‌వో హైమావతి, టీబీ నివారణ అధికారి స్వప్న, డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎస్తేరురాణి వైద్యాధికారులు చరిష్మ, సీతారామలక్ష్మితో పాటు ఏఎన్‌ఎం, ఎంఎల్‌హెచ్‌పి, ఆశ కార్యకర్తలు, కార్యదర్శులకు గోల్డ్‌, బ్రోన్జ్‌ అవార్డులు అందించారు.

28న జెడ్పీ సర్వసభ్య సమావేశం

మహారాణిపేట (విశాఖ): ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 28న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు చెందిన అన్ని శాఖల అధికారులు తమ పరిధి లోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పూర్తి నివేదికలతో హాజరుకావాలని సీఈవో సూచించారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఉన్నతాధికారులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement