న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2026
మిట్టల్
ఉక్కు..
నేటి పీజీఆర్‌ఎస్,
రెవెన్యూ క్లినిక్ రద్దు
తుమ్మపాల: కలెక్టరేట్‌తో పాటు జిల్లాలో అన్ని మండల, డివిజన్ స్థాయిల్లో ఈ నెల 23వ తేదీ సోమవారం నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నక్కపల్లి మండలంలో ఆర్సెలార్ మిట్టల్–నిప్పన్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జరగనున్న భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. శంకుస్థాపన ఏర్పాట్ల పనుల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైందని, అందువల్ల పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు. ఈ నెల 30న యథావిధిగా పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
నక్కపల్లి: తరతరాలనుంచి సంక్రమించిన భూములను నమ్ముకుని జీవిస్తున్న రైతులు, నిర్వాసితుల నోట్లో ప్రభుత్వం మట్టికొట్టింది... మిట్టల్ ప్రయోజనాల కోసం వారి జీవితాలను పణంగా పెట్టింది... స్టీల్‌ప్లాంట్ కోసం కేటాయించిన భూముల్లో నివాసం ఉంటున్న వారిని ఉన్న పళంగా బలవంతంగా ఖాళీ చేయించింది... కట్టుబట్టలతో పునరావాస కాలనీలకు తరలిపోవాలని హుకుం జారీ చేయడంతో పాటు పూర్వీకుల నుంచి నివాసం ఉంటున్న ఇళ్లను నేలమట్టం చేసింది. గూడు చెదిరి నిర్వాసితులు చెట్టుకొకరుపుట్టకొకరు మాదిరిగా చెదిరిపోయారు. దీంతో తమకు కన్నీరే దిక్కయిందని నిర్వాసితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్సిలర్‌మిట్టల్‌స్టీల్‌ప్లాంట్ ప్రయోజనాల కోసం ప్రభుత్వం రైతులకు, నిర్వాసితులకు అన్యాయం చేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూసేకరణ సమయంలో ఇస్తానన్న హామీలు అమలు చేయకుండా మోసం చేసిందంటూ నిర్వాసితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చందనాడ, తమ్మయ్యపేట, మూలపర్ర, బోయపాడు, అమలాపురం బుచ్చిరాజుపేట గ్రామాల పరిధిలో సుమారు 735 మంది నిర్వాసితులను గుర్తించింది. వీరంతా తాము నివసించే ఇళ్లు, ఇంటి స్థలాలు, పశువుల పాకలను స్టీల్‌ప్లాంట్ కోసం త్యాగం చేశారు. ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ కింద రూ.25లక్షలు, ఇంటి స్థలం ఇవ్వాలన్నది నిర్వాసితుల డిమాండ్. గతంలో నిర్వాసితుల కోరిన కోరికలునెరవేరుస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చింది. ఇంటి స్థలం, ఆర్ అండ్ ఆర్‌ప్యాకేజీ కేవలం కింద రూ.8.98లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొంది.
శంకుస్థాపన కోసం బలవంతంగా ఖాళీ...
స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన సమయం దగ్గరపడుతుండటంతో జిల్లా యంత్రాంగం అంతా ఈ గ్రామాల్లో తిష్టవేసి బలవంతంగా నిర్వాసితులను ఖాళీ చేయించింది. అధికారులనుంచి వచ్చిన ఒత్తిళ్లు తట్టుకోలేక బాధితులంతా ఊళ్లు వదిలేసి పోవాల్సి వచ్చింది. నిర్వాసితుల ఖాతాల్లో రూ.8.98లక్షల చొప్పున జమ చేయడంతో గత్యంతరం లేక బాధితులంతా ఉన్న ఊరిని కట్టుకున్న ఇళ్లను వదిలి, పాడిపశువులను అమ్మేసుకుని కట్టుబట్టలతో పునరావాస కాలనీలకు పరుగులు తీశారు. తీరా వెళితే అక్కడ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
ఆడబిడ్డలకు అన్యాయం...
భూసేకరణ సమయానికి వివాహం కాని ఆడబిడ్డలకు ఆర్ అండ్‌ఆర్‌ప్యాకేజీ ఇస్తామని చెప్పిప్రభుత్వం మోసం చేసిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.వివాహం అయిన ఆడపిల్లలకు పైసా కూడా ప్యాకేజీ ఇవ్వలేదు. దీంతో వారంతా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. వారి వేదన అరణ్యరోదనే అవుతోంది. ఒక పక్క స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపన పేరుతో అధికార పార్టీనాయకులు హడావుడిచేస్తుంటే మరో పక్క సర్వం కోల్పోయి నిర్వాసితులు పునరావాస కాలనీలో అలోలక్ష్మణా అంటూ భవిష్యత్‌ను తలచుకుని కన్నీటి పర్యంత మవుతున్నారు.పెరిగిన ధరల కారణంగా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ఇల్లుకట్టుకునే స్థోమత లేదని వాపోతున్నారు. రేకుల షెడ్లు, పాకల్లోనే కాలక్షేపం చేస్తామని వారు చెబుతున్నారు.నిర్వాసితులు ఇల్లునిర్మించుకుంటే సిమెంట్, ఐరన్ తక్కువ ధరలకు ఇప్పిస్తామని అధికారులు ప్రకటించారు.అదీ కూడా అమలు చేయలేదు. తక్షణమే ఇల్లు ఖాళీ చేసి వేరొక చోట అద్దెకు ఉంటే నెలకు రూ.5వేలు చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారని అదికూడా పూర్తిగా అమలు చేయలేదని వారు ఆరోపిస్తున్నారు.
ఎలా బతకాలో తెలియడం లేదు
మా ఇళ్లు, భూములు స్టీల్‌ప్లాంట్‌కోసం తీసేసుకున్నారు. 30సెంట్ల భూమికి డబ్బులిస్తే ఆ డబ్బుతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేశాం. సర్వంకోల్పోయాం.తరతరాలుగా నమ్ముకున్న భూతల్లినుంచి మమ్మల్ని వేరు చేశారు. ఇంటి నిర్మాణం కోసం కేవలం తొమ్మిది లక్షలు ఇచ్చారు.తొలగించిన ఇంటికి రూ.3లక్షలు ఇచ్చారు.ప్రస్తుత పరిస్థితిలో ఇల్లుకట్టుకోడానికి ఈ డబ్బు ఏమూలా చాలదు. ఏం చేయాలో తోచడం లేదు. కాటికి కాలు చాచిన వయసులో ఉన్న ఊరికి, భూములకు దూరమైపోయాం. ఎలా బతకాలో తెలియడం లేదు.పాడిపశువులను కూడా అమ్మేసుకున్నాం.
– మడుగుల రమణ,తుమ్మలపేట
ప్రభుత్వం అన్యాయం చేసింది
ప్యాకేజీ విషయంలోప్రభుత్వం అన్యాయం చేసింది. ఆడపిల్లలకు పైసా ఇవ్వలేదు. కట్టుబట్టలతో ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయాం. ఏం చేయాలో ఎలా బతకాలో తోచడం లేదు. పశువులను సైతం అమ్మేసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చిన సాయం ఇల్లునిర్మించుకోడానికి చాలదు. భవిష్యత్ తలచుకుంటే భయం వేస్తోంది.
– మడగల గోవిందు, నిర్వాసితుడు
గూడు చెదిరింది...గోడు మిగిలింది
స్టీల్‌ప్లాంట్ శంకుస్థాపన పేరుతో
ఇళ్లు కూల్చివేత
కట్టుబట్టలతో పునరావాస
కాలనీకి బాధితులు
షెడ్లలోనే కాపురం
పాడిపశువులను అమ్మేసుకుని
ఉపాధి కోసం ఎదురు చూపులు


