పునరావాస కాలనీలో ఇల్లుకట్టుకునే స్థోమత లేక
షెడ్డువేసుకున్న నిర్వాసితుడు రమణ కుటుంబం
ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపడక చాలా మంది తమకు కేటాయించిన స్థలాల్లో చిన్నపూరిపాకలు, రేకుల షెడ్లు వేసుకుని కాపురాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. స్థోమత కలిగిన వారు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పాడిపశువులను సైతం అమ్మేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత ఊళ్లలో అయితే తమ పొలాల్లో ఆవులు,గెదేలు, గొర్రెలు మేకలను మేపుకొంటూ కాలక్షేపం చేయడంతోపాటు, వాటి ద్వారా ఆదాయం సంపాదించుకుని ఉపాధి పొందేవారు. ఉన్న భూములన్నీ ప్రభుత్వం తీసేసుకుని పునరావాసకాలనీలకు పంపేయడంతో అక్కడ పశువులను మేపుకొనేందుకు పొలాలు లేవని, చేసేదేమీలేక పాడిపశువులను అమ్మేసుకోవాల్సి వచ్చిందంటూ రైతులు కన్నీటి పర్యంత మవుతున్నారు.


