భద్రతా ఏర్పాట్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

భద్రతా ఏర్పాట్ల పరిశీలన

Mar 21 2026 5:05 AM | Updated on Mar 21 2026 5:05 AM

నక్కపల్లి: మండలంలో చందనాడ పంచాయతీ తమ్మయ్యపేట వద్ద ఈనెల 23 న జరగనున్న ఆర్సిలర్‌మిట్టల్‌స్టీల్‌ప్లాంట్‌ భూమిపూజ కార్యక్రమానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లను విశాఖ రేంజ్‌ డీఐజిగోపీనాఽథ్‌ జెట్టి శుక్రవారం పరిశీలించారు. ఎస్పీ తుహిన్‌సిన్హాతో కలసి శంకుస్థాపన కార్యక్రమం, బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఐటీశాఖామంత్రి లోకేష్‌ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై తీసుకున్న చర్యలను, వీఐపీలు ప్రయాణించే మార్గాలు, హెలీప్యాడ్‌, బహిరంగ సభ వేదిక తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు, ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యఅతిథులకు జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్న నేపథ్యంలో అత్యున్నత స్థాయి ప్రోటోకాల్‌ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయరహదారిపై ప్రయాణికులకు ఇబ్బందికలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పార్కింగ్‌ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు దేవప్రసాద్‌, మోహన్‌రావు, డీఎస్పీ ఆర్‌.మోహన్‌, నర్సీపట్నం అనకాపల్లి డీఎస్పీలు శ్రీనివాసరావు, శ్రావణి, సీఐలు మురళి,రామకృష్ణ,బాలసూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement