● జిల్లాలో రోజుకు గృహా, వాణిజ్య అవసరాల నిమిత్తం పామాయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ 10 వేల కిలోలను వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీటిలో 50 శాతం పామాయిల్, 40 శాతం సన్‌ప్లవర్ ఆయిల్, 10 శాతం ఇతర నూనెలు వాడుతున్నారు. పామాయిల్, సన్‌ప్లవర్ ఆయిల్ ధరలు రూ.6 నుంచి రూ.10 పెరిగింది. దీంతో వినియోగదారులపై భారం పడింది. పామాయిల్ రూ.90 –115 నుంచి రూ.120–140 వరకూ పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ. 140–160 నుంచి రూ.166–178 వరకూ పెరిగింది.
● జిల్లాలో 300 వరకూ ఆయిల్ మిల్లులు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచి, పాయకరావుపేట, చోడవరం,సబ్బవరం, ఎస్.రాయవరంలో ఎక్కువగా ఆయిల్ మిల్లులు ఉన్నాయి. వీటిలో వేరుశనగ, నువ్వుల నూనెలు తయారవుతాయి. మిల్లుల ద్వారా తయారైన నూనె 3 వేల కిలోలకు పైగా వినియోగమవుతోంది.


