పోలీసు సిబ్బంది సమస్యలను ఆన్‌లైన్‌లో తెలుసుకుంటున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: జిల్లాలో పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎస్సీ తుహిన్ సిన్హా తెలిపారు. వివిధ పోలీసు స్టేషన్‌ల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలను ఎస్పీ –సంపర్క్ కార్యక్రమంలో శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పది మంది సిబ్బంది వారి సమస్యలు తెలిపారన్నారు. పోస్టింగ్‌లు, బదిలీలు, సెలవులు, కుటుంబ ఆరోగ్య సమస్యలను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. సిబ్బంది తమ సమస్యలను సెల్ నంబర్ 93469 12011 ద్వారా తెలియజేయవచ్చన్నారు. ప్రతి ఫిర్యాదును డిజిటల్ రిజిస్టర్‌లో నమోదు చేసి, పరిష్కారమయ్యే వరకూ పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఎల్.మోహన్‌రావు, ఎస్‌ఐ ప్రసాద్, కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


