సున్నం! | - | Sakshi
Sakshi News home page

సున్నం!

Feb 17 2026 7:36 AM | Updated on Feb 17 2026 7:36 AM

సున్న

సున్నం!

వడ్డీ రాయితీకి

పాయకరావుపేట మండలం మంగవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి జెమీలు అనే రైతు వ్యవసాయ పెట్టుబడులు నిమిత్తం గతేడాది పాయకరావుపేట సహకార బ్యాంక్‌లో రూ.1 లక్ష పంట రుణం తీసుకున్నారు. ఏడాదికి గానూ వడ్డీ రూ.7 వేలు అయింది. అయితే ఆ రైతు సకాలంలోనే బ్యాంక్‌కు చెల్లించారు. ఆ రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సున్నా వడ్డీ రాయితీ పథకంలో భాగంగా

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 శాతం వడ్డీ రాయితీ, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న 4 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ రైతుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3 వేలు వడ్డీ మాత్రమే పడింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రూ.4 వేలు వడ్డీ రాయితీ పడలేదు.

దీంతో ఆ రైతుకు నాలుగు వేలు భారం

పడింది. ఈ పథకం రూ.3 లక్షల వరకూ

వర్తిస్తుంది. అదే మూడు లక్షల రుణం తీసుకునే రైతుకు అయితే రూ.12 వేల వరకూ

వడ్డీ భారం పడుతుంది.

సాక్షి, అనకాపల్లి: వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం. అన్నదాతలను అదుకుంటాం అంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్నలను నిలువునా మోసం చేస్తోంది. సున్నా వడ్డీకి సున్నం పెట్టింది. అంతేకాకుండా 19 నెలల పాలనలో రైతుకు తొలి ఖరీఫ్‌ సీజన్‌లో ఒక ఏడాది పెట్టుబడి సాయం ఎగవేసింది. రెండో ఏడాది అరకొరగానే అందించింది. ఇక కౌలు రైతులకు రెండేళ్లు ఎగనామం పెట్టింది. ఉచిత పంట బీమా లేదు..ఎరువుల కొరతతో రెండు ఖరీఫ్‌ సీజన్‌లలో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోయారు. ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎగనామం పెట్టింది. మోసపూరిత వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల నుంచి రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలకు వడ్డీ రాయితీ చెల్లించడం మానేసింది. దీంతో వడ్డీభారం రైతుల మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. తీసుకున్న పంట రుణాలు సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్నా సున్నా వడ్డీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎసరు పెడుతోంది. కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నా..రాష్ట్ర ప్రభుత్వం వాటా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. దీంతో జిల్లాలో ఉన్న 4.3 లక్షల మంది రైతులు నష్టపోతున్నారు.

వైఎస్సార్‌ హయాంలో

రైతులకు తోడ్పాటుగా..

దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు, తదుపరి రైతులు తీసుకునే రుణాలు సకాలంలో చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని ప్రకటించారు. లక్ష రూపాయల లోపు రుణాలు తీసుకున్న రైతులకు ఏడాదికి వసూలు చేసే వడ్డీ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం 3 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వడ్డీ భరిస్తాయి. అది రూ.3 లక్షలు వరకు రుణాలు తీసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే 4 శాతం వడ్డీ రాయితీ చెల్లిస్తుంది. 2004 నుంచి ఈ వడ్డీ రాయితీ పథకాన్ని పక్కాగా అమలు చేశారు. తరువాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో తూట్లు పొడిచారు. మళ్లీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కూడా వైఎస్సార్‌ బాటలోనే రైతులకు వడ్డీ రాయితీ అందించింది. వ్యవసాయ అవసరాల కోసం రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీని ప్రభుత్వమే భరించింది. ఐదేళ్ల పాటు నిరాటంకంగా ఈ పథకాన్ని జగనన్న సర్కారు అమలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం 19 నెలలు గడుస్తున్నా రైతులు సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నా..పూర్తిగా ఎసరు పెట్టింది.

ఏది బాబూ సహకారం

సకాలంలో రుణాలు చెల్లించినా పైసా విదల్చని సర్కారు

సక్రమంగా తన వాటా ఇస్తున్న కేంద్రం

19 నెలలుగా ఆ ఊసెత్తని రాష్ట్ర ప్రభుత్వం

రైతులపై రూ.25 కోట్ల మేర భారం!

జిల్లాలో నష్టపోతున్న 4.2 లక్షల మంది రైతులు

సున్నం!1
1/2

సున్నం!

సున్నం!2
2/2

సున్నం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement