ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి..
చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే ఏటా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ. 3 వేల పింఛన్ అందిస్తామని గొప్పలు చెప్పారు. లోకేష్ అయితే జగన్‌లా కాదు జాబ్ కేలండర్ కూడా ప్రకటించి పక్కాగా అమలు చేస్తానన్నాడు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో మూడు బడ్జెట్‌లు వచ్చినా నిరుద్యోగ భృతికి ఒక్క రూపాయి కేటాయింపు లేదు. ఉద్యోగం ఇవ్వకపోగా కనీసం ఒక్కరికై నా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం యువతను, నిరుద్యోగులను మోసం చేసి రోడ్డున పడేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు, ఇపుడు కూటమి ప్రభుత్వంలో కూడా యువతకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మాలి.
– మరిశా శ్రావణ్, రాష్ట్ర విద్యార్థి విభాగ సంయుక్త కార్యదర్శి, రాజాం, బుచ్చెయ్యపేట మండలం


