ప్రత్యేక రైళ్లు పొడిగింపు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్, హోలీ పండుగల నేపథ్యంలో ప్రస్తుతం నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను మరికొంతకాలం పొడిగించినట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డీసీఎం పవన్‌కుమార్ తెలిపారు.
విశాఖపట్నం–చర్లపల్లి
(08579/08580) వీక్లీ స్పెషల్
ప్రతీ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరే రైలు మార్చి 27 వరకు, ప్రతీ శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు చర్లపల్లి నుంచి తిరుగు రైలు మార్చి 28 వరకు పొడిగింపు.
విశాఖపట్నం–ఎస్‌ఎంవీ బెంగళూరు (08581/08582) వీక్లీ స్పెషల్
ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 3.20గంటలకు విశాఖ నుంచి బయల్దేరే రైలు మార్చి 29 వరకు, ప్రతీ సోమవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు నుంచి నడిచే తిరుగు రైలు మార్చి 30 వరకు పొడిగింపు.
విశాఖపట్నం–తిరుపతి
(08547/08548) వీక్లీ స్పెషల్
ప్రతీ బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖ నుంచి బయల్దేరే రైలు మార్చి 25వ వరకు, ప్రతీ గురువారం రాత్రి 9.50 గంటలకు తిరుపతి నుంచి బయల్దేరే తిరుగు రైలు మార్చి 26 వరకు పొడిగింపు.
సంత్రగచ్చి–యల్లహంక
(02863/02864) స్పెషల్
ప్రతీ గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు సంత్రగచ్చి నుంచి బయల్దేరే రైలు మార్చి 26 వరకు, ప్రతీ శనివారం తెల్లవారు 4.50 గంటలకు యల్లహంక నుంచి నడిచే తిరుగు రైలు మార్చి 28 వరకు పొడిగింపు.
భువనేశ్వర్–యశ్వంత్‌పూర్ (02811/02812) ఏసీ స్పెషల్
ప్రతీ శనివారం రాత్రి 7.15 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరే ఈ రైలు మార్చి 28 వరకు, ప్రతీ సోమవారం తెల్లవారు 4.30 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి నడిచే తిరుగు రైలు మార్చి 30 వరకు పొడిగింపు.
సంబల్‌పూర్–ఈరోడ్
(08311/08312) వీక్లీ స్పెషల్
ప్రతీ బుధవారం ఉదయం 11.35 గంటలకు సంబల్‌పూర్ నుంచి బయల్దేరే ఈ రైలు మార్చి 25 వరకు, ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఈరోడ్ నుంచి నడిచే తిరుగు రైలు మార్చి 27 వరకు కొనసాగింపు.
విశాఖపట్నం–తిరుపతి
(08583/08584) స్పెషల్
ప్రతీ సోమవారం రాత్రి 7.10 గంటలకు విశాఖ నుంచి బయల్దేరే ఈ రైలు మార్చి 30 వరకు, ప్రతీ మంగళవారం రాత్రి 9.50 గంటలకు తిరుపతి నుంచి నడిచే తిరుగు రైలు మార్చి 31 వరకు పొడిగింపు.
విశాఖపట్నం–షాలిమర్
(08508/08507) స్పెషల్
ప్రతీ మంగళవారం ఉదయం 11.20 గంటలకు విశాఖ నుంచి బయల్దేరే ఈ రైలు మార్చి 17 వరకు, ప్రతీ బుధవారం తెల్లవారు 5 గంటలకు షాలిమర్ నుంచి నడిచే తిరుగు రైలు మార్చి 18 వరకు కొనసాగింపు.
తిరువనంతపురం నార్త్–సంత్రగచ్చి
వీక్లీ స్పెషల్
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరువనంతపురం నార్త్–సంత్రగచ్చి (06081/06082) వీక్లీ స్పెషల్ రైళ్లు కూడా నడుస్తున్నాయి. ఫిబ్రవరి 20, 23 తేదీల వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.


