దార్శనిక నేత సంక్షేమ ప్రదాత
ఆదివారం శ్రీ 21 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
నవరత్నాలు చేరని కుటుంబం లేదు... సంక్షేమ పథకాల ఫలితం పొందని పేదవాళ్లూ లేరు... మ్యానిఫెస్టోలో నెరవేరని హామీ కూడా లేదు... పథకాల అమలులో మాట తప్పిందీ లేదు... ఎటువంటి కష్టకాలం వచ్చినా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా సంక్షేమ రథాన్ని దిగ్విజయంగా నడిపించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనం గుండెల నిండా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జనరంజక పాలనందించింది. ఒక వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధికి బాటలు వేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన 1,341 గ్రామ, వార్డు సచివాలయాలు ప్రజాసేవలకు క్షేత్రస్థాయిలో వేదికగా మారాయి. 10,660 మంది ఉద్యోగులు, మరో 21 వేల మంది వలంటీర్లతో గడప వద్దకే పాలనను అందించారు. నవరత్నాల్లాంటి సంక్షేమ పథకాలను అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికీ నయాపైసా అవినీతికి ఆస్కారం లేకుండా చేర్చారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధితో జిల్లా ప్రగతి పథంలో ముందుకు దూసుకుపోయింది. కోవిడ్ లాంటి విపత్కర సమయంలో కూడా ఏ పథకాన్నీ ఆపకుండా కొనసాగించారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో సంస్కరణలు తీసుకొచ్చారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునికీకరించి, డిజిటల్ విద్యకు నాంది పలికారు. ఆరోగ్యశ్రీ ద్వారా నాణ్యమైన వైద్యాన్ని పేదవాడికి అందుబాటులోకి తెచ్చారు. దేశానికే ఆదర్శంగా పాలన అందించారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా.. ఆయన పాలనలో లబ్ధిపొందిన వారు తమ అభిమాన నాయకుడితో ఉన్న అనుబంధాన్ని, పొందిన మేలును గుర్తు చేసుకుంటున్నారు. – సాక్షి, అనకాపల్లి
● జననేత జనరంజక పాలన దేశానికే ఆదర్శం
● విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
● నాడు–నేడు ద్వారా పాఠశాలలకు కొత్తరూపు
● సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు
● ఆరోగ్యశ్రీ ద్వారా పేదోడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం


