వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫీజుకు ఢోకా లేదు..
ఈమె పుల్లేటికుర్తి అప్పలరత్నం. ఈమెది గొలుగొండ మండలం, గొలుగొండ గ్రామం. తండ్రి సత్తిబాబు టైలర్, తల్లి గృహిణి. తండ్రి సంపాదన మీదే కుటుంబ జీవనం సాగేది. 2019 నుంచి కాకినాడ కై ట్ కాలేజీలో మూడేళ్ల పాటు డిప్లమో చదింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏడాదికి రూ.35 వేలు చొప్పున మూడేళ్లకు ప్రభుత్వం నుంచి రూ.1.05 లక్షలు ఫీజురీయింబర్‌మెంట్ కింద కాలేజీకి జమఅయింది. దీంతో మూడేళ్లు పైసా ఖర్చు లేకుండా డిప్లమో పూర్తి చేసింది. 2023లో రాజమండ్రి గైట్ కాలేజీ బీటెక్‌లో చేరింది. ఏడాదికి రూ.58 వేలు కాలేజీకి చెల్లించాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో రెండు నెలల క్రితం కేవలం రూ.14 వేలు మాత్రమే ఇచ్చింది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఇబ్బంది పడలేదు.


