జగనన్న హయాంలో రైతులకు ఎంతో మేలు
ఈ చిత్రంలో రైతు పేరు పయిల నూకన్న నాయుడు. నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట చెందిన ఈయనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. జగనన్న రైతు భరోసా కింద ఐదేళ్లపాటు ఆర్థికసాయం అందింది. ప్రతిఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. అంతకు ముందు ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన నూకన్న నాయుడు గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో అప్పుచేయకుండా వ్యవసాయం చేశాడు. గతంలో ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరకు ఎరువులు కొనుగోలు చేసేవాడు. గత ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలద్వారా అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో స్వగ్రామంలో అందజేయడంతో పీఏసీఎస్‌లు, వ్యవసాయశాఖ కార్యాలయా ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకపోయింది. ధాన్యం కొనుగోలు కూడా ప్రభుత్వమే చేపట్టింది. అన్ని విధాల రైతులకు ప్రయోజనం కలిగింది. దీంతో ఐదేళ్లపాటు ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేసుకోగలి గాడు. ఇతర పథకాల వల్ల కూడా నూకన్న నాయు డు కుటుంబానికి లబ్ధి చేకూరింది. మనవడికి అమ్మఒడి పథకం, డ్వాక్రా రుణ మాఫీ, ఇంటి స్థలం, వైఎస్సార్ చేయూత వంటి పథకాల వల్ల సుమారు మూడు లక్షల మేర లబ్ధిపొందాడు.


