మా బాబుకి పునర్జన్మ ఇచ్చిన దేవుడు జగనన్న
మాది నర్సీపట్నం టౌన్‌లో శివపురం కాలనీ. మా బాబు పేరు కర్రి మోహిత్. వయస్సు ఐదు సంవత్సరాలు. ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్నాడు. పుట్టిన ఏడు నెలలకే ట్రాకియోస్టమీ అనే శ్వాస కోశ వ్యాధితో బాధపడేవాడు. గొంతులో శ్వాసకు శ్లేష్మం అడ్డంకి ఉన్నప్పుడు.. వెంటిలేటర్ ద్వారా శ్వాసనాళం నుంచి దానిని తొలగించేవారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేవాడు. మాట్లాడేవాడు కాదు..పాలు తాగేవాడు కాదు.చనిపోయే పరిస్థితికి వచ్చేశాడు. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. తెలిసిన బంధువుల ద్వారా విశాఖ రెయిన్‌బో ఆస్పత్రిలో రెండేళ్ల పాటు వైద్యం చేయించాం. తరువాత అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని చెప్పారు. అక్కడ నుంచి విజయవాడ బిజామ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అప్పటికే చాలా మంది వద్ద అప్పులు చేసి వైద్యం చేయించాం. ఎవరూ మాకు అప్పు ఇచ్చే పరిస్థితి లేదు. చేసేదేమీ లేక మా బాబును ఇంటికి తీసుకొచ్చాం. అప్పటి నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ ద్వారా సీఎం జగనన్నకు మా పరిస్థితిని చెప్పుకున్నాం. వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.5.8 లక్షలు అందజేశారు. విజయవాడలో బిజామ్స్ హాస్పిటల్లో గొంతులో శ్వాసనాళంలోకి (ట్రాకియా) నేరుగా గాలిని పంపించడానికి ఆపరేషన్ చేసి రంధ్రం ద్వారా ట్రాకియోస్టమీ ట్యూబ్ (గొట్టం) ఆపరేషన్ చేశారు. ఇప్పుడు వ్యాధి పూర్తిగా నయమైంది. స్కూల్‌లో కూడా జాయిన్ చేశాం. మా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నాం. మా కుమారుడికి పునర్జన్మను ఇచ్చిన దేవుడు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటున్నాం.
– కర్రి శంకరాచారి, సంయుక్త, నర్సీపట్నం
ఆపరేషన్ జరిగిన ప్రాంతాన్ని చూపుతున్న మోహిత్ తల్లిదండ్రులు సంయుక్త, శంకరాచారి


