పేద కుటుంబానికి ఆసరా..
ఈమెది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమాని మునగపాక మండలంలోని తిమ్మరాజుపేటకు చెందిన ముప్పిడి కొండబాబు,లక్ష్మి కుటుంబానికి పెద్ద ఎత్తున మేలు చేకూరింది. కొండబాబు స్థానికంగా పారిశుధ్య కార్మికునిగా పనిచేస్తున్నాడు. భార్య లక్ష్మి స్థాని కంగా ఆయాగా సేవలందిస్తున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ కుటుంబానికి పెద్దమొత్తంలో లబ్ధి చేకూరింది. కొండబాబుకు వచ్చే అరకొర వేతనంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో కుటుంబానికి వచ్చిన లబ్ధి ఆసరాగా నిలిచింది. అర్హులందరికీ పక్కా ఇళ్ల పథకంలో భాగంగా లక్ష్మికి పట్టా అందజేశారు. ప్రభుత్వం అందజేసిన ఆర్థిక సహకారం రూ.1.80 లక్షలకు మరికొంత సొమ్మును పోగుచేసి సొంతింటి కలను నెరవేర్చుకున్నారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా రూ.45 వేల మేర రుణం మాఫీ అయింది . దీనికి తోడు వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఏటా రూ.18,500 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.74వేల మేర లబ్ధిపొందారు. లక్ష్మి కుమారుడు కనకరాజు ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తుండడంతో వాహన మిత్ర పథకం ద్వారా రూ.ఏడాదికి రూ.10వేల చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ.40వేల మేర సాయం పొందాడు. రూ.10వేలతో చేదోడు పథకం కింద చిరు వ్యాపారం చేసింది. కనకరాజు కుమార్తెకు ఏటా అమ్మఒడి పథకం ద్వారా రూ.13వేల చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ.52వేల సాయం అందింది. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాకముందు ఆర్థికంగా ఇబ్బందులు పడేవారమని తరువాత పలు పథకాల రూపంలో లబ్ధి పొంది ఆనందంగా గడిపామని లక్ష్మి తెలిపారు.పేదల పక్షాన జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తూ ఎప్పుడు ఏ పథకం వస్తుందో ముందుగానే తెలిసేదని చెప్పారు.జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మా కుటుంబానికి మేలు చేకూరిందని ఆమె తెలిపారు.
ముప్పిడి లక్ష్మి


