జిల్లాలో 3988 టన్నుల ధాన్యం సేకరణ
తుమ్మపాల : ఖరీఫ్ 2025–26 సీజన్‌కు జిల్లాలో ఈ నెల 16 నాటికి అత్యఽధికంగా 3,988.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం జరిగిందని, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1,428 మంది రైతుల నుంచి రూ.9.46 కోట్ల విలువ గల ధాన్యం సేకరించినప్పటకి రూ.6.92 కోట్లను 1,179 మంది రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల లోపే 74 శాతం చెల్లించడం జరిగిందని, మిగిలిన రూ.2.54 కోట్ల తదుపరి బ్యాంకు బ్యాచి ప్రాసెస్ జమచేయడం జరుగుతుందన్నారు. రైతులకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు అందించడం జరిగిందన్నారు. రైతులు ధాన్యం విక్రయించడంలో ఎటువంటి ఇబ్బందులున్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెం.8008901584ను సంప్రదించాలన్నారు. జిల్లాలో 65 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని తెలిపారు.


