భయంతోనే రాకపోకలు
మా గ్రామానికి రాకపోకలు సాగించాలంటే తాండవ కాలువపై జిల్లేడుపూడి వద్ద నిర్మించిన వంతెనపై ప్రయాణించాలి. మా పంచాయతీ శివారు గ్రామాలైన సీతారాంపురం, లక్ష్మీపురం, పార్వతీపురం గ్రామస్తులు ఆ వంతెనపై నుంచి రాకపోకలు సాగించాలి. శిథిలమైన వంతనలపై ప్రయాణించేటప్పుడు భయంగా ఉంటుంది. మా పంచాయతీకి మరో మార్గం లేదు. ఈ సమస్యను అనేకసార్లు అఽధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
–పైల శిరీష, సర్పంచ్, చెర్లోపాలెం పంచాయతీ
తరుచూ ప్రమాదాలు
దెబ్బతిన్న వంతెనలు, కల్వర్టులపై రాకపోకలు సాగించేటప్పుడు పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. రక్షణ గోడలు పూర్తిగా ధ్వంసం కావడంతో కొత్తగా వచ్చే వారు ఏమాత్రం ఏమరుపాటుగా డ్రైవింగ్ చేసినా ప్రవహించే తాండవ కాలువలో పడిపోయే ప్రమాదం ఉంది. మా పంచాయతీలో గోవిందపురం వెంకయ్యపాలెం నడుమ తాండవ కాలువపై నిర్మించిన కల్వర్టు వద్ద అనేక ప్రమాదాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు.
– లాలం లోవ, జిల్లేడుపూడి గ్రామం
భయంతోనే రాకపోకలు


