కనకమ్మకు నీరా‘జనం’
యలమంచిలి రూరల్: మార్గశిర మాసం రెండో శుక్రవారం సందర్భంగా యలమంచిలి ధర్మవరం కనకమహాలక్ష్మికి లక్ష కుంకుమార్చన నిర్వహించారు. సుమారు 1500 మందికి పైగా మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు వెలవెలపల్లి కోటేశ్వరశర్మ (కోటి పంతులు) పూజా క్రతువును భక్తులతో చేయించారు. అమ్మవారి దర్శనం, పూజల్లో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. కుంకుమ పూజల అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. పూజల్లో పాల్గొన్న మహిళా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉత్సవ కమిటీ చై ర్మన్ కొఠారు సాంబ,సభ్యులు తాటిపాకల నాని, చిన్ని, గొల్లవిల్లి చిన్నాజీ, ఏబీఎల్ రాజు, కొఠారు సూర్యప్రకాష్ తదితరులు పర్యవేక్షించారు.
భక్తుల పూజలందుకుంటున్న
కనకమహాలక్ష్మి అమ్మవారు
యలమంచిలిలో
రెండో శుక్రవారం పోటెత్తిన భక్తులు
కనకమ్మకు నీరా‘జనం’


