గొప్పూరులో బిర్సాముండా జయంతి వేడుకలు
మాడుగుల రూరల్: శంకరం పంచాయతీలో నాన్ షెడ్యూల్ ప్రాంతంలోని ఆదివాసీలకు జల్ జమీన్ జంగిల్‌పై పూర్తి అధికారాల కోసం ఆదివాసులంతా పోరాడాలని ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా ఐదో సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు ఇరటా నరసింహమూర్తి అన్నారు. గొప్పూరులో బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమాన్ని గిరిజనులతో కలిసి శనివారం ఆయన నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. జల్ జమీన్ జంగిల్‌పై ఆదివాసీలకు హక్కు కోసం బిర్సాముండా పోరాడి నాడు విజయం సాధిస్తే నేడు బీజేపీ, టీడీపీ ప్రభుత్వాలు వాటిని కాలరాస్తున్నాయని నరసింహమూర్తి అన్నారు. శంకరం పంచాయతీ పరిధిలో అన్ని గిరిజన గ్రామాల్లో గెడ్డలపై వంతెనలతో పాటు అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె.భవాని, సోలం చంద్రశేఖర్, సన్యాసమ్మ పాల్గొన్నారు.


