కె.జె.పురంలో పిరమిడ్ ధ్యానశక్తి కేంద్రం ప్రారంభం
మాడుగుల రూరల్: ప్రతి ఒక్కరు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, సంకల్పశక్తి, ఆత్మజ్ఞానం, ఆత్మవిశ్వాసం చేకూరుతుందని, స్పిరిచ్చువల్ టాబ్లెట్స్ రీచెర్స్ ఫౌండర్ చైర్మన్ (యు.కె) పొలమరశెట్టి గోపాలకృష్ణ పేర్కొన్నారు. మండలంలో కె.జె.పురం గ్రామంలో సృష్టి పిరమిడ్ ధ్యాన శక్తి కేంద్రంను శనివారం స్థానిక కళ్యాణ మండపంలో ప్రారంభించారు. స్థానిక పిరమిడ్ నిర్వాహకులు ఆడారి చిన్నారావు, మల్లేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ధ్యానం ద్వారా నాడి మండలం శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో బ్రహ్మర్షి పిరమిడ్ ట్రస్టు ఫౌండర్ పొలమరశెట్టి ఈశ్వరమ్మ, మాట్లాడుతూ ధ్యానం వల్ల మానవుల్లో ఆందోళన, భయం, దుఃఖం, నిరాశ, మూఢ నమ్మకాలు సంపూర్ణంగా తొలగిపోతాయన్నారు. కార్యక్రమంలో పాపయ్యరాజుపాలెం పిరమిడ్ ట్రస్టుకు చెందిన పొలమరశెట్టి సతీష్, జ్యోతి, కామేశ్వరావు, వాణి మాట్లాడారు. అనంతరం అన్నసమారాధన జరిపారు.


