డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
అదనపు ఎస్పీ దేవప్రసాద్
నర్సీట్నం: డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ తెలిపారు. గంజాయి నిర్మూలనే ధ్యేయంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అభ్యుదయం పేరుతో పోలీసులు చేపట్టిన సైకిల్ యాత్ర ఈ నెల 14వ తేదీ సాయంత్రం నర్సీపట్నం చేరుకుంది. తిరిగి శనివారం నర్సీపట్నం నుంచి యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ మత్తుకు బానిసలై విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉద్యోగ, ఉపాధిపై దృష్టిసారించాలని సూచించారు. సైకిల్ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.విజయ్, డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు గోవిందరావు, ఎల్.రేవతమ్మ తదితరులు పాల్గొన్నారు.


