పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన రుసల్ ప్రతినిధి బృం
నర్సీపట్నం: రష్యాకు చెందిన రుసల్ కంపెనీ ప్రతినిధి బృందం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఈ బృందం ఇక్కడ కళాశాలలో మైనింగ్ విభాగాన్ని పరిశీలించింది. విద్యార్థులకు కంపెనీలో ఉపాధి కల్పించడానికి ఆసక్తి కనబరిచింది. మూడు నెలల శిక్షణ అనంతరం మంచి వేతనంతో పాటు ఉచిత వసతి, భోజన వసతి సౌకర్యాలు తమ కంపెనీ కల్పిస్తుందని ప్రతినిధులు చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తాతాజీ, మైనింగ్ విభాగ అధిపతి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


