
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
దేవరాపల్లి: స్థానిక ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీ లు నిర్వహించారు. మనగ్రోమోర్ షాపు, సురేష్ జనరల్ స్టోర్స్‌లో విజిలెన్స్ ఎస్‌ఐ బి.రవికుమా ర్, కానిస్టేబుల్ ప్రసాద్, మండల వ్యవసాయాధి కారి ఎల్.వై. కాంతమ్మ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా యూరియా నిల్వ లు, స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్‌ల నిర్వహణ తదిత ర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతులకు ఎరువులు విక్రయించే సమయంలో మనగ్రోమోర్ షాపు నిర్వాహకులు బిల్లుబుక్‌లు సక్రమంగా నిర్వహించకపోవడాన్ని గుర్తించారు. దీంతో తాత్కాలికంగా ఎరువుల విక్రయాలు నిలిపివేయాలని షాపు యజమానిని ఆదేశించారు.