
బైలపూడిలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్
చీడికాడ: మండలంలోని బైలపూడిలో గంజా యి రవాణా, ఇతర అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ను శనివారం నిర్వహించారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి ఆధ్వర్యంలో కె.కోటపాడు సీఐ పైడిపు నాయుడు, స్థానిక ఎస్‌ఐ బి.సతీష్ , 15 మంది ఎస్‌ఐలు, 100 మంది పోలీసు సిబ్బంది ఉదయం 4 నుంచి 8 గంటల వరకు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డులు లేని 13 బైక్‌లు, ఒక ఆటో, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ శ్రావణి తెలిపారు. ఈ గ్రామంలో గంజాయి కేసుల్లో ఇప్పటి వరకు 38 మంది అనుమానితు లు, 92 మంది నిందితులున్నారన్నారు. గంజా యి కేసుల్లో ఈ గ్రామానికి చెందిన 11 మంది కారాగార శిక్ష అనుభవిస్తున్నారని, ఒక్కొక్కరికీ రూ.లక్ష జరిమానా విధించినట్టు చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, గంజాయి రవాణా, విక్రయానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు.