
విద్యార్థి గౌతమ్ తల్లిదండ్రులకు అప్పగింత
విద్యార్థి ఉల్లింగల గౌతమ్‌ను తల్లిదండ్రులకు అప్పగిస్తున్న పోలీసులు
కశింకోట : మండలంలోని వెదురుపర్తి గ్రామానికి చెందిన టెన్త్ విద్యార్థి ఉల్లింగల గౌతమ్ (14) కనిపించకుండా పోయిన అనతి కాలంలోనే పోలీసులు పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. సీఐ అల్లు స్వామినాయుడు గురువారం అందించిన వివరాల ప్రకారం.. వెదురుపర్తి హైస్కూల్లో టెన్త్ చదువుతున్న గౌతమ్ బుధవారం ఉదయం 11 గంటలకు విరామ సమయంలో స్కూలు నుంచి బయటకు వెళ్లాడు. ఇంటికి చేరలేదు. తల్లిదండ్రులు ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సీఐ అల్లు స్వామినాయుడు పర్యవేక్షణలో ఎస్‌ఐ కె. లక్ష్మణరావు, కానిస్టేబుల్ అప్పలరాజు బృందంగా వెళ్లి సీసీ కెమెరాల పుటేజిలు ఆధారంగా యలమంచిలి వైపు వెళ్లినట్టు గుర్తించి గౌతమ్‌ను గురువారం పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.