
డీసీసీబీలో ఆకర్షణీయంగా రుణాలు
రైతులకు రుణాల చెక్కును అందిస్తున్న
డీసీసీబీ చైర్మన్ తాతారావు, సీఈవోలు
ఎస్.రాయవరం: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఉమ్మడి విశాఖ జిల్లా చైర్మన్ కోన తాతరావు అన్నారు. అడ్డురోడ్డు డీసీసీబీ బ్యాంకులో స్వయం సహాయక సంఘాలకు రూ.5.03 కోట్ల రుణాలను శుక్రవారం మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాతారావు మాట్లాడుతూ జాతీయ బ్యాంకులు కన్నా మెరుగైన సేవలు అందించాలన్న సదుద్దేశంతో డీసీసీబీ పని చేస్తుందన్నారు. రైతులు ఏ పంట వేసినా రుణాలు అందజేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. డీసీసీబీ సీఈవో డి.వి.ఎస్.వర్మ మాట్లాడుతూ రూ.2400 కోట్ల రుణాల టర్నోవర్‌తో రూ.2 కోట్ల లాభంతో బ్యాంకు సేవలు అందిస్తుందన్నారు. ఇటీవల నియమితులైన పీఏసీఎస్ చైర్ పర్స్‌న్లు గుర్రం వెంకటరామకృష్ణ, గెడ్డం కన్నబాబు, వెలగా శ్రీనివాసరావు, రెడ్డి పవన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.