
సౌకర్యాలపై జీవీఎంసీ కమిషనర్ ఆరా
అల్లిపురం: గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు అందుతున్న సౌకర్యాలను జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ పర్యవేక్షించారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సిటీ ఆపరేషన్స్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను బుధవారం అదనపు కమిషనర్ ఎస్‌ఎస్ వర్మ, పర్యవేక్షక ఇంజినీర్లు పీవీ సత్యనారాయణ రాజు, గోవిందరావులతో కలసి పరిశీలించారు. నడక మార్గంలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు హెల్ప్‌లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. లుంబినీ పార్కు, వెంకోజీపాలెం వద్ద ఏర్పాటు చేసిన తాగునీటి పాయింట్లను సందర్శించారు. ప్రసాద వితరణ చేపడుతున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఎప్పటికప్పుడు వ్యర్థాలను శుభ్రం చేయాలని పారిశుధ్య కార్మికులను ఆదేశించారు.