
ఖైనీ, గుట్కా అమ్మకాలపై పోలీసుల దాడులు
నర్సీపట్నం: టౌన్, రూరల్ పోలీసులు మంగళవారం పాన్ షాప్‌లపై మెరుపుదాడులు నిర్వహించారు. నీలంపేట, గబ్బాడ, చెట్టుపల్లి గ్రామాల్లోని పాన్‌షాపుల్లో రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ సిబ్బందితో కలిసి తనిఖీలు చేచేశారు. గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని షాపు యజమానులపై కేసులు నమోదు చేశారు. నర్సీపట్నం టౌన్‌లోని పాన్‌షాపుల్లో సీఐ గోవిందరావు, ఎస్‌ఐ రమేష్, సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఖైనీ, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు. పాఠశాలలు, కాలేజీలకు వంద మీటర్లలోపు నిషేధిత మత్తు పదార్థాలు అమ్మితే శిక్షార్హులు అవుతారని సీఐ రేవతమ్మ వ్యాపారులను హెచ్చరించారు.