
1,114 కేసులు పరిష్కారం
యలమంచిలిలో లోక్ అదాలత్ నిర్వహిస్తున్న సీనియర్ సివిల్ జడ్జి విజయ
యలమంచిలి రూరల్: జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా శనివారం స్థానిక న్యాయస్థానాల సముదాయంలో సీనియర్ సివిల్ జడ్జి పి.విజయ అధ్యక్షతన నిర్వహించిన లోక్ అదాలత్‌లో 1,114 కేసులు పరిష్కారమయ్యాయి.వివిధ కేసుల్లో కక్షిదారులకు రూ.1,66,67,280 చెల్లింపులు జరిగాయి. న్యాయమూర్తులు జి.స్పందన, కె.రమేష్,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.సత్యనారాయణ,లోక్ అదాలత్ సభ్యులు డి.వెంకటరావు, పి.వి.రమణ,పలువురు న్యాయవాదులు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.