
భూములు ఆన్‌లైన్ చేయాలని నిరసన
భూములను ఆన్‌లైన్ చేయాలంటూ నిరసన తెలుపుతున్న రైతులు
పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా భూములను ఆన్‌లైన్ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ మాకవరపాలెం మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. రెవెన్యూ అధికారులు కోడూరు పరిధిలో ఉన్న తమ భూములను ఆన్‌లైన్ చేయకపోవడంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రైతుల నుంచి ఎకరాకు రూ. లక్ష చొప్పున వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మంజూరు కాకపోవడంతో గత్యంతరం లేక అప్పులు చేసి నగదు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. రెవెన్యూ అధికారులు గ్రామంలో భూములను సర్వే చేసి ఆన్‌లైన్ చేయాలని పీజీఆర్‌ఎస్‌లో అధికారులను కలిసి విన్నవించుకున్నారు.