
రిటైర్డ్ హోంగార్డుకు ఆర్థిక సాయం
రామునాయుడుకు చెక్కును అందజేస్తున్న ఎస్పీ తుహిన్ సిన్హా
అనకాపల్లి: పరవాడ పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహించి ఇటీవల పదవీ విరమణ పొందిన కె.రామునాయుడుకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల హోం గార్డులు ఒక రోజు వేతనం రూ.4,04,965 అందజేశారు. ఈ మొత్తం చెక్కును ఎస్పీ తుహిన్‌సిన్హా శుక్రవారం తన కార్యాలయంలో ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డులు పదవి వీరమణ పొందినా, అనారోగ్య కారణంగా మృతి చెందినా హోంగార్డుల ఒక రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా ఇవ్వడం అభినందనీయమన్నారు. హోంగార్డులు పోలీస్ శాఖలో ఒక భాగమేనన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన ప్రతి ఉద్యోగికి గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి ఏ రామ్‌కుమార్, సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్య, జూనియర్ అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు.