తండ్రి మందలించాడని బాలిక ఆత్మహత్య
అనకాపల్లిటౌన్: తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ బాలిక ఆదివారం ఆత్మహత్య చేస్తుంది. పట్టణ ఎస్‌ఐ డి.ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలో మళ్లవీధికి చెందిన జంప మహిమ చంద్(17) అనే బాలిక ఇంటర్మీడియెట్ పరీక్షల్లో మూడు సబెక్టులు తప్పంది. అయితే రోజూ ఉదయం లేటుగా నిద్ర నుంచి లేస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఇంటిలో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ప్రేమ్‌చంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఎస్‌ఐ ఈశ్వరరావు తెలిపారు.


