
స్పాట్ వాల్యుయేషన్ నుంచి మినహాయించాలి
● డీఈవో గిడ్డి అప్పారావునాయుడుకు యూటీఎఫ్ వినతి
అనకాపల్లి : ప్రభుత్వ నిబంధనల ప్రకారం కచ్చితంగా బదిలీ అయ్యే అవకాశమున్న స్కూల్ అసిస్టెంట్లను సప్లిమెంట రీ స్పాట్ వాల్యు యేషన్ నుంచి మినహాయించా లని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్ కోరారు. జీవీఎంసీ విలీన గ్రామం కొప్పాకలోని జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడుకు శనివారం ఆయన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 31, జూన్ 1, 2వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు బదిలీ వెబ్ ఆప్షన్ ఇచ్చుకునే పనిలో ఉన్నారని, వారందరికీ మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో స్పాట్ వాల్యుయేషన్‌ను రీ షెడ్యూల్ చేయాలని కోరారు. ఒక వైపు ప్రభుత్వమే బదిలీల షెడ్యూ ల్ని ప్రకటించి అవే రోజుల్లో పేపర్లను మూ ల్యాంకనం చేయాలని చెప్పడం సరికాదన్నారు. పేపర్లు దిద్దడానికి రాని ఉపాధ్యాయులపై చర్యలు ఉంటాయని అధికారులు చెప్పడంతో భయపడుతున్నారని వాపోయారు.