జనం మదిలో జగనన్న
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సంబరాలు జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, అభిమానుల కోలాహలంతో వాడవాడలా పండగ వాతావరణం నెలకొంది. కేవలం వేడుకలకే పరిమితం కాకుండా విస్తృత సేవా కార్యక్రమాలతో అభిమానం చాటుకున్నారు. అనేక చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు, వృద్ధులకు పండ్లు, దుస్తులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఊరూరా కేక్ కటింగ్‌లు, సంబరాలు మిన్నంటాయి. బాణసంచా కాల్చి వేడుక జరుపుకొన్నారు.
సాక్షి, అనకాపల్లి: అభిమానం ఉప్పొంగింది. సేవాభావం వెల్లివిరిసింది. అధినాయకుడి పుట్టిన రోజును అభిమానులు పండగలా చేసుకున్నారు. ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సువర్ణ పాలనను ప్రజలు తలచుకున్నారు. జననేతా.. వర్థిల్లు వందేళ్లు.. అని ఆశీర్వదించారు.
● చోడవరం నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ఆధ్వర్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. చోడవరం ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయం, గోవాడ శివాలయం, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చోడవరంలో అమర్‌నాథ్ కేక్ కట్‌చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారన్నారు. మాజీ ఎమ్మెల్యే గూనూరు మిలట్రీ నాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, రాష్ట్ర యూత్ విభాగం సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, జిల్లా యూత్ అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు దేవరపల్లి సత్య పాల్గొన్నారు.
● నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గణేష్, ఆయన తనయుడు విజయ్ అవినాష్‌తోపాటు 200 మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. అనకాపల్లి పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, మున్సిపల్ వైస్‌చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ పెట్ల అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి రుత్తల యర్రాపాత్రుడు, స్టేట్ యూత్ విభాగం జాయింట్ సెక్రటరీ చింతకాయల వరుణ్, టౌన్ పార్టీ అధ్యక్షుడు ఏకా శివ, జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత తదితరులు పాల్గొన్నారు.
● మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మాడుగుల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఆర్‌సీఎం వృద్ధాశ్రమం, ఆర్‌సీఎం ఆస్పత్రి, ప్రభుత్వ ఆస్పత్రులలో వృద్ధులకు, రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు అందజేశారు. చుక్కపల్లిలో జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. కె.కోటపాడు మండలం ఆనందపురం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ ఉత్తరాంధ్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పాల్గొని కేక్ కట్ చేశారు.
● యలమంచిలి, అచ్యుతాపురంలలో పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పాల్గొని కేక్ కట్ చేశారు. పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. కొండకర్ల ఆవ సమీపంలో ఇచ్ఛా ఫౌండేషన్‌లో ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు పల్లెల సాయికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ధర్మశ్రీ పాల్గొని.. దివ్యాంగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అన్నసమారాధన నిర్వహించారు. మునగపాకలో పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో కరణం ధర్మశ్రీ పాల్గొని కేక్ కట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు, ఎస్‌ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ పాల్గొన్నారు.
● పాయకరావుపేటలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు నిర్వహించిన వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకల్లో సమన్వయకర్త కంబాల జోగులు పాల్గొని కేక్ కట్ చేశారు. నక్కపల్లి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ నిర్వహించిన వేడుకల్లో కూడా కంబాల జోగులు పాల్గొని కేక్ కట్ చేశారు. అభయాంజనేయస్వామి ఆలయంలో జగన్‌మోహన్‌రెడ్డి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటవురట్ల మండంలో మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి ఆర్‌ఎస్ సీతారామరాజు, జెడ్పీటీసీ సిద్ధాబత్తుల ఉమాదేవి కేక్ కట్ చేశారు.
● ఆనకాపల్లిలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్, పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ భీశెట్టి వెంకట సత్యవతి కేక్ కట్ చేశారు. సత్యనారాయణపురం, కొత్తూరు, తుమ్మపాల గ్రామంలో, పట్టణంలోని 80వ వార్డులో, కశింకోట మండలంలోని పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మలసాల భరత్‌కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. గవరపాలెంలో నిర్వహించిన మెడికల్ క్యాంప్‌లో పాల్గొన్నారు.
ఉప్పొంగిన అభిమానం.. వెల్లివిరిసిన సేవాభావం
జిల్లావ్యాప్తంగా ఘనంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు
వాడవాడలా సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు
జనం మదిలో జగనన్న
జనం మదిలో జగనన్న


