పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధాన్ని అమలు చేయాలని సీపీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు జి.రాజు అన్నారు. స్థానిక నర్సింగరావుపేటలోని సీపీఎస్ కార్యాలయం మేడమైన సీపీఎస్ 10వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్‌కు 10 సంత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమలు నిర్వహించడం జరిగిందన్నారు. పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టం 2013 నుంచి అమల్లోకి వచ్చిన కారణంగా 2013కు ముందు నియామకం పొందిన ఉద్యోగులందరిలోపాటు, 2003 డీఎస్సీతోను పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావలసిందిగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీపీఎస్ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఇ.కిషోర్, బి.రామాంజనేయులు, వి.మురళి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


