ఏఐ ఆధారిత ఆవిష్కరణలకు ప్రోత్సాహం
మహారాణిపేట (విశాఖ): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ‘ఎలక్ట్రాన్ వైబ్–హ్యాక్ ఏపీ హ్యాకథాన్’ ఫలితాలను ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ ప్రకటించారు. విశాఖలోని సీవోఈఈటీ భవనంలో జరిగిన ఈ పోటీల్లో పలు స్టార్టప్ సంస్థలు తమ ప్రతిభను చాటాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, ఏపీట్రాన్స్‌కో జేఎండీ జి. సూర్యసాయి ప్రవీణ్ చంద్‌తో కలిసి ఆయన విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. పృథ్వీతేజ్ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత ఆవిష్కరణలను ప్రోత్సహించడమే ఈ హ్యాకథాన్ లక్ష్యమన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను ముందస్తుగా గుర్తించడం, హైటెన్షన్ లైన్లలో ఇన్సులేటర్ లోపాలను కనిపెట్టడం వంటి అంశాలపై స్టార్టప్‌లు వినూత్న పరిష్కారాలను చూపాయన్నారు. ప్రతిభావంతులైన యువతకు పైలట్ ప్రాజెక్టులు కేటాయించి ఉపాధి కల్పిస్తామని చెప్పారు.
ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్


